లోక్ సభ ఎన్ని కల నిర్వహణ, పోలింగ్ అంశాలపై సిబ్బందికి పూర్తి స్థా యి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ డే సిబ్బంది సహా మొత్తం 1,47,429 మందికి ప్రత్యేకంగా ట్రైనిం గ్ ఇచ్చారు. అందులో ఈవీఎం హ్యాండ్లిం గ్ పై మరికొందరికి స్పెషల్ ట్రైనిం గ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పోలింగ్ ఆలస్యం గా ప్రారంభమైన ఘటనలున్నాయి. అయితే, వాటి వాడుకపై సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇబ్బందులొచ్చాయి తప్ప, ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అంతేకాదు, పోలింగ్ స్టేషన్ల వద్ద ఈవీఎంలను సరఫరా చేసే ఈసీఐఎల్ , బీఈఎల్ ఇంజనీర్లు ఉన్నా వారి సేవలను వినియోగించుకోలేదని సీఈవో గుర్తిం చారు. ఈ నేపథ్యం లోనే వారికి పూర్తి స్థా యి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేం ద్రాల వద్ద పరిస్థి తులను ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారులకు చెప్పేలా పోలీస్ అధికారులకూ శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా 3,649 మంది కౌంటింగ్ సిబ్బందికి తరగతులు నిర్వహించారు. అవసరమైతే ఎన్నికలయ్యాక మరోసారీ వారికి శిక్షణ ఇచ్చే అవకాశాలను సీఈవో రజత్ కుమార్ పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ఎక్కువగా ఉండడంతో వాటిపై అధికారు-లు దృష్టి పెట్టారు. అందుకోసం 441 మంది శిక్షణ పొందారు. బుధవారం సీఈవో కార్యాలయంలో ఐటీ అధికారిని నియమించారు. 24 గంటల పాటు టీవీలు, వాట్సాప్ , ఫేస్ బుక్ , ట్వి ట్టర్ , ఇన్ స్టాగ్రామ్ ,యూట్యూబ్ లను పర్యవేక్షించేం దుకూ ప్రత్యేక సెల్ ను పెట్టారు. కాగా, ఎన్ని కల్లో డబ్బు , మద్యం ప్రవాహాన్ని నిరోధించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నామని జాయిం ట్ సీఈవో రవికిరణ్ తెలిపా రు. పార్టీలు, అభ్యర్థు లు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. రాష్ట్రమంతా వివిధ విభాగాల వి జిలెన్స్ టీమ్ లు పనిచేస్తున్నాయని, పౌరులూ తమ దృష్టికి వచ్చిన ఉల్లం ఘనలను సీ విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
1,47,429 మందికి శిక్షణ
- Telugu States
- March 22, 2019
లేటెస్ట్
- Varun Aaron: అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్
- Rashmika Mandanna: రష్మికకు గాయం.. దెబ్బ ఎలా తగిలిందంటే..?
- సంక్రాంతి స్పెషల్: పతంగుల పండుగకి హైదరాబాద్ రెడీ
- V6 DIGITAL 10.01.2025 AFTERNOON EDITION
- Robin Uthappa: యువరాజ్ సింగ్ రిటైర్ అవ్వడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే కారణం.. కేఏ పాల్
- GST పోర్టల్ సేవలు బంద్.. జనవరి10న12గంటల నుంచి అందుబాటులో ఉండవు
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్..రూ. 5కోట్లు దోచుకున్న 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్..
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో