ఒకరు మోస్ట్ సీనియర్ లీడర్. మరొకరు పదేళ్లుగా విపక్షంలో ఉన్న యువ నేత. ఇంకొకరు ఐదేళ్ల ప్రస్థానంతో తొలిసారిబరిలోకి దిగుతున్న సినిమా స్టార్. ముగ్గురు నేతల మధ్య పోటీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నికల తర్వాత అలాంటి రసవత్తర రాజకీయం కనిపిస్తోంది. అసెంబ్లీకి, లోక్ సభకు కూడా ఒకే సారి ఎన్నికలుండడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ముగ్గురు నేతలకు కలిసొచ్చే అంశాలు అదే సమయంతో ఇబ్బందిపెట్టే అంశాలు బలంగానే ఉండడంతో నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజల తీర్పు రోజు రోజుకు సస్సెన్స్ గా మారుతోంది ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాదాపు చివరికే చేరాయి. రాష్ట్రంలో మూడు పార్టీలు బరిలో కనిపిస్తున్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడో పక్షంగా రంగంలోకి వచ్చిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు నాలుగైదు సభలు, రోడ్డు షోలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మొన్నటివరకు పాదయాత్రతో జనంలోనే ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రోజుకు మూడు నాలుగు సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలో హోరాహోరీ పోరు కనిపిస్తుంటే ఎప్పటిలాగే సర్వేలు గందరగోళం రేపుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు వచ్చిన పలు సర్వేల్లో వైసీపీకి పైచేయి ఉన్నట్లు చెబితే, ఆ తర్వాత వచ్చిన సీఓటర్ సర్వే టీడీపీకి అనుకూలంగా అంచనాలిచ్చింది. అయితే అనుకూల, ప్రతికూల అంశాల ప్రకారం చూస్తే గెలుపోటములపై ఎలాంటి అంచనాకు రాలేనంత తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.విభజన నుంచి హోదా వరకు 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో పాటే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది.మొత్తం 175 స్థానాల్లో టీడీపీ 102 సీట్లు గెలిచింది. అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజన కార ణంగానే ఏపీలో తుడిచిపెట్టుకుపోయిం ది. టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని బరిలో దిగింది. అప్పుడే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. విభజనకు ముందు పరిస్థితుల్లో గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ ఒంట రిగా పోటీ చేసింది. ఆ ఎన్ని కల్లో కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేతను కోరుకున్న జనం చంద్రబాబుకు పట్టం కట్టారు. ఓటింగ్ శాతాల పరంగా చూస్తే టీడీపీకి 44.9 శాతం, వైసీపీకి 44.6 శాతం వచ్చాయి. కేవలం 0.3 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారాన్ని అందుకుంది. ఇప్పుడు మ రోసారి ఎన్నికల బరిలో దిగిన టీడీపీకి కొన్ని సానుకూలతలతో పాటు అదే స్థాయిలో వ్యతిరేకతలు ఉన్నాయి.
ఐదేండ్ల పాలనలో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత , అవినీతిఆరోపణలు, ఎమ్మెల్యేలపై అనేక వివాదాలు, ప్రత్యేక హోదాపై మాట మార్చారన్న విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఐదేండ్లుగా అధికార పార్తోటీ ఒంట రి పోరాటం చేస్తున్న వైసీపీకి ఈసారి చావోరేవో తేల్చుకోవాల్సి న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి గెలుపుపైనే పార్టీ భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది. దీంతో జగన్ ప్రచారంలో ఏ చిన్న అంశాన్నీ దిలిపెట్టడంలేదు. పార్టీ ప్రకటించిన నవరత్నాల హామీలను ప్రచారం చేస్తూనే ప్రత్యేకహోదాపై బాబు మోసం చేశారని పదేపదే గుర్తుచేస్తున్నారు. తన హామీలను చూసే బాబు ఎన్నికల ముందు వాటిని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. తనపై హత్యాయత్నంతో పాటు వైఎస్ వివేకా హత్యకు చంద్రబాబే కారణమని ప్రతిసారీ జగన్ ప్రస్తావిస్తున్నారు.పాదయాత్రతో చాలాకాలం జనంలో ఉండడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుందని జగన్ నమ్ముతున్నారు.
2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఈసారి సొంతంగా బరిలోకి దిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదనీ,అవినీతి పెరిగిం దని చెబుతూ పవన్ టీడీపీకి దూరమయ్యారు. తర్వాత లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర , గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం కనిపిస్తోంది. సామాజికవర్గ సమీకరణాలను జనసేన ప్ర భావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బీఎస్పీకి 21 సీట్లు, లెఫ్ట్ పార్టీలకు 14 సీట్లు కేటాయించి న పవన్ మిగిలిన సీట్లలో కొన్నింటికి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. గత ఎన్ని కల్లో ఏపీలో బీఎస్పీ 0.7 శాతం, సీపీఎం 0.4 శాతం, సీపీఐ 0.3 శాతం ఓట్లు సాధిం చాయి. దీంతో వాటి ప్రభావంపై పెద్దగా అంచనాల్లేవు. అన్ని వర్గాలకు మేలు చేసేలా పథకాలు తెస్తామని మేనిఫెస్టో ప్రకటించారు పవన్. అయితే ప్రచారంలో మాత్రం మేనిఫెస్టో కంటే రాజకీయ అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఆయన. చంద్రబాబు, జగన్ తో పాటు కేసీఆర్ పైనా ప్రచారంలో విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీకి, జనసేనకు మధ్య రహస్య ఒప్పం దం ఉందని వైసీపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు చాలావరకు కొత్త అభ్యర్థులనే బరిలోకి దించినా నాదెండ్ల మనోహర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, నాగబాబు, ఎస్పీవై రెడ్డి లాంటివారు ఉండడం ఆసక్తి రేపుతోంది.
ప్రాంతాలు..కులాలు..బలాలు
ప్రాంతాల వారీగా చూస్తే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు, రెండు గోదావరి జిల్లాల్ లో టీడీపీకి ఎక్కువ సీట్లు రావడమే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లో 34 సీట్లు ఉంటే టీడీపీ 24 సీట్లు గెలిచింది. ఈసారి జగన్ సభలకు జనం భారీగానే వస్తున్నా టీడీపీ ప్రభావం పెద్దగా తగ్గలేదు. ప్ర భుత్వ వ్యతిరేకత ఉన్నా పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణాలు, తుఫాను సాయం లాంటివి టీడీపీకి కలిసొస్తున్నాయి. అయితే సాజికంగా జనసేనకు వచ్చే ఓట్లు గ తంలో టీడీపీకి పడినవే. ఈసారి జన సేనరంగంలో ఉండ టంతో ఆ ఓట్లను టీడీపీ కోల్పోయే అవకాశం ఉంది. తర్వాత రెండు గోదావ రి జిల్లాల్లో 34 సీట్లు ఉండగా గ తంలో టీడీపీకి 27 సీట్లువ చ్చా యి. ఈసారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాపు వర్గంలో ఓట్ల చీలిక, పవన్ పోటీ లాంటి అంశాలు టీడీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన చీల్చడంపైనే టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. కోస్తాలో కృష్ణా , గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమకు ఆనుకొని ఉండే ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నిపిస్తోంది.చాలా చోట్ల మంత్రులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో బరిలో ఉన్న చంద్రబాబు కొడుకు లోకేష్, స్పీకర్ కోడెల శివప్రసాద్ లాంటివారు కూడా గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.ఈ మూడు జిల్లాల్లో ని 45 సీట్లలో గతంలో టీడీపీ 27 సీట్లను గెలిచిం ది. ప్రకాశంలో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించి నా మొత్తంగా టీడీపీదే పైచేయి అయ్యింది. రాజధాని అమరావతి పరిధిలో కొన్ని సీట్లలో టీడీపీకి సానుకూలంగా ఉన్నా మిగతా ప్రాంతాల్లో కొం త ఎదురుగాలి కనిపిస్తోంది. ఓట్లలో జనసేన చీలిక తెస్తే ఫ లితాలు మారే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని 10 సీట్లలో గతంలో వైసీపీకి ఏడు, టీడీపీకి మూడు దక్కా యి. ఈసారిజిల్లాలో వైసీపీ ప్రభావం మీద అంచనాలతోనే టీడీపీ టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆదాల ప్రభాకర రెడ్డి చివరిక్షణంలో పార్టీ మారిపోయారు.
ఇక రాయలసీమ జిల్లాల్లో గత ఎన్నికల్లో అనంతపురం తప్ప మూడు జిల్లాల్లో వైసీపీకి భారీగా సీట్లు వచ్చాయి. ఒక్క అనంతపురంలో టీడీపీ పైచేయి సాధించింది. సీమలో మొత్తం 52 సీట్లలో వైసీపీకి 29 వస్తే, టీడీపీకి ద క్కిం ది 23. ఈసారి అనంత లో చివరి నిమిషంలో నేతలు పార్టీ మారడం, టికెట్లపై అసంతృప్తుల కారణంగా టీడీపీ పట్టునిలబెట్టుకో వడంపై సందేహాలున్నాయి. ఇక్కడ వైఎస్ వివేకా హత్య ప్రభావం ఉండే అవకాశం ఉంది.
టీడీపీ బలాలు
చంద్రబాబు నాయ క త్వం,
క్షేత్రస్థా యిలో బలమైన కేడ ర్ ,
పథకాలు, పెన్షన్ల పెంపు, రైతు సాయం,
అమరావతి, పోలవరం నిర్మాణం,
పార్టీ ఆర్థిక వనరులు, పోల్ మేనేజ్మెంట్ పై
పట్టు , అధికారంలో ఉండ టం.
బలహీనతలు
అవినీతి ఆరోపణలు,
ఇసుక మాఫియా సమస్య,
ప్రత్యేక హోదాపై మాటమార్చడం, పార్టీవారికే
పథ కాలు అందాయ న్న విమర్శలు,
జన్మభూమి కమిటీల పనితీరు.
వైసీపీ బలాలు
ప్రభుత్వ వ్యతిరేక త , ప్రత్యేక
హోదాపై ఒకే మాట, నవరత్నా ల హామీలు,
వైఎస్ ఇమేజ్, అసమ్మతులు తక్కువ గా
ఉండటం.
బలహీనత లు
క్షేత్రస్థాయి కేడర్ నిర్మాణం
సరిగా లేకపోవడం, పోల్
మేనేజ్మెంట్‌పై అవ గాహన తక్కువ, జగన్ పై
ఆరోపణలను తిప్పి కొట్టలేకపోవడం, అభ్యర్థుల
ఆర్థిక స్థితిగ తులు.
జనసేన బలాలు
పవన్ కల్యాణ్ అభిమానులు,
సామాజిక వర్గ సమీకరణాలు.
బలహీనతలు
పార్టీ నిర్మాణం లేకపోవడం,
సెగ్మెం ట్లలో ప్రభావితం చేసే
నాయకత్వం లేదు,
నిరాధారంగా ఆవేశంతో విమ ర్శలు చేయడం.