- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మైన గోపాల్, కోర్వ శ్రీకాంత్ గెలుపు
బైంసా, వెలుగు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసా వెండి, బంగారు వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం పోటాపోటీగా జరిగాయి. దిలావర్పూర్ మండలంలోని కాల్వ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలో ఎన్నికలు నిర్వహించారు. సంఘం ప్రతినిధులు కలి కోట రాములు, ఎస్.భూమన్న, అల్లాడి ప్రకాశ్, బద్రీ రవీంద్రమూర్తి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
సంఘ అధ్యక్ష పదవికి మైస గోపాల్, బెజ్జంకి రవి, మాటేగామ్ భోజన్నలు, ప్రధాన కార్యదర్శి స్థానానికి కోర్వ శ్రీకాంత్, రమేశ్ పోటీ పడగా.. పోలింగ్ అనివార్యమైంది. దీంతో సంఘ ఎన్నికల అధికారులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఓటింగ్ నిర్వహించగా అధ్యక్షుడిగా మైస గోపాల్, ప్రధాన కార్యదర్శిగా కోర్వ శ్రీకాంత్ గెలుపొందారు. వీరికి ఎన్నికల నిర్వహణ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందచేయగా, సంఘ సభ్యులు సన్మానించారు.