చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి

చౌటుప్పల్, వెలుగు : చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారంహైదరాబాద్​లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని చేనేత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న చేనేత సమస్యలపై సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేసిందన్నారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి.. సంఘాలకు రుణమాఫీ చేయాలని కోరారు.