బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
  •     కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
  •     బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రెసిడెంట్ జాజాల శ్రీనివాస్ గౌడ్​​ 

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్​ ప్రకారం స్టేట్‌లో  సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రెసిడెంట్​జాజాల శ్రీనివాస్​గౌడ్​ డిమాండ్ ​చేశారు. కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.  కామారెడ్డి నుంచి కరీంనగర్​వరకు 14  నుంచి 31 వ తేది వరకు  చేపట్టనున్న యాత్ర ఆదివారం కామారెడ్డిలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కళా భారతి ఆడిటోరియంలో నిర్వహించిన మీటింగ్​లో  శ్రీనివాస్​గౌడ్ మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇటీవల రేవంత్​రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున  కుల గణన పక్రియ వెంటనే చేపట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ  బీసీ డిక్లరేషన్​ను కామారెడ్డిలో ప్రకటించిందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కుల గణన చేపట్టకపోతే   దేశ వ్యాప్తంగా మరో మహా మండల్ ఉద్యమాన్ని తీసుకొస్తామన్నారు. రిటైర్డు ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ..  

కులగణనతో దేశ సమగ్రత దెబ్బతింటుందని ప్రచారం చేస్తున్న రిజర్వేషన్​ వ్యతిరేకుల వాదనలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. బీసీ కుల సంఘాల జేఎసీ చైర్మన్ కుందారం  గణేశ్​చారి, బీసీ సంక్షేమ సంఘం స్టేట్​ ప్రెసిడెంట్​ బైరి రవికృష్ణ, కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చాప శివ రాములు, ప్రతినిధులు కుల్కచర్ల శ్రీనివాస్​ముదిరాజ్, శ్యాంకుమార్, విక్రమ్​గౌడ్​, వెంకటేశ్, సురేందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.