ముషీరాబాద్, వెలుగు: ఎలక్టోరల్బాండ్స్దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. లిబర్టీలోని ఆప్స్టేట్ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని 41 కార్పొరేట్ గ్రూపులపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిగాయని, అవన్నీ బీజేపీకి రూ.2,592 కోట్లు విరాళంగా ఇచ్చాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలను భయపెడుతూ.. ప్రశ్నించే విపక్షాలను అణిచి వేస్తోందని మండిపడ్డారు.
ALSO READ ; బీఆర్ఎస్ను అభ్యర్థులూ తిరస్కరిస్తున్నరు!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్కేజ్రీవాల్పాత్ర ఏమీ లేదని, ఈడీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తే బీజేపీకి ఓటమి తప్పదని తెలిసే.. ప్రధాని మోదీ అరెస్ట్చేయించారని ఆరోపించారు. దేశ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో నేతలు బుర్ర రాము గౌడ్, హేమ జిల్లోజు, నర్సింగ్ యమునా గౌడ్, జావేద్, షరీఫ్, దర్శనం రమేశ్, విజయ్, కొడంగల్ శ్రీనివాస్, శివాజీ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.