- ఎలక్టోరల్ అబ్జర్వర్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓటర్లకు నాణ్యమైన ఎపిక్ ఓటరు కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ బాల మాయాదేవి ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి ఆమె పలు శాఖల ఆఫీసర్లతో ఆదివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు క్షేత్ర స్థాయిలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్‌లు నిర్వహించాలని సూచించారు.
వారి సలహాలు, సూచనలను ఎన్నికల కమిషన్ కు పంపాలన్నారు. ఓటర్ అవగాహనపై స్వీప్ యాక్టివిటీస్, స్టార్ క్యాంపైనర్స్ ద్వారా కాలేజీల్లో ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని చెప్పారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మీటింగ్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవో దామోదర్ రావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, తహసీల్దార్లతో పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.