జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో.. ర్యాష్ డ్రైవింగ్ తో యువతి కారు బీభత్సం

హైదరాబాద్  ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్  కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ యువతి  ర్యాష్ డ్రైవింగ్ తో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు ఫుల్ స్పీడ్ గా ఉండడంతో రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో పడ్డాయి. కారును అక్కడే వదిలేసి యువతి పారిపోయింది. ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ  వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంటోంది. గుడిసెకి అడుగుదూరంలో కారు ఆగిపోయింది. కారు నెంబర్ ఆధారంగా యువతిని  గుర్తించే పనిలో ఉన్నారు ఫిల్మ్ నగర్ పోలీసులు. యువతి ఫుల్ గా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసినట్లుగా తెలుస్తుంది.