
సంగారెడ్డి జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. జోగిపేటలోని SBI బ్యాంక్ ముందు పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఆ తర్వాత స్కూటీ లోపలి నుంచి మంటలు చెలరేగి.. బ్యాటరీ పేలిపోయింది. దీంతో అక్కడున్న బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు భయబ్రాంతులకు గురై.. అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఎలక్ట్రిక్ బ్యాటరీ పేలడంతో అందులో నుంచి పొగ దట్టంగా అలుముకుంది. స్థానికులు స్కూటీలోని బ్యాటరీని బటయకు తీసి.. డ్రైనేజీలో పడేశారు. దీంతో పెను ముప్పు తప్పింది.