హైదరాబాద్ మరో ఘనతను దగ్గించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫార్ములా ఈ' కార్ రేసింగ్ కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్ములా ఈ సంస్థకు, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. ఈ రేసింగ్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంటుంది. ఈ రేసింగ్ జరగబోతున్న నేపథ్యంలో లండన్, న్యూయార్క్, రోమ్, సియోల్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది.
ఇతర రేసింగ్ లకు ఈ కార్ రేసింగ్ లకు తేడా ఉంది. ఇతర రేసింగ్ లను ప్రత్యేకంగా నిర్మించిన రేస్ ట్రాక్ లలో నిర్వహిస్తారు. ఈ రేసింగ్ కు ప్రత్యేక ట్రాక్ అవసరం లేదు. నగరంలో రోడ్లు సాఫీగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా ఉండాలి. మరోవైపు మన దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలను కాదని ఈ రేసింగ్ హైదరాబాదుకు రానుంది.మరోవైపు ఈ అగ్రిమెంట్ లో భాగంగా రేస్ నిర్వహించే ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రేక్షకుల కోసం అక్కడక్కడ స్టాండ్స్ ను ఏర్పాటు చేయాలి.
మరిన్ని వార్తల కోసం...
వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం