హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్పో ఐదో ఎడిషన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటును తక్కువగా వాడుకునే ప్రొడక్టులను తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు.
కన్స్ట్రక్షన్ పరిశ్రమకు వైరింగ్ ఇండస్ట్రీ కీలకమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయ న స్టాళ్లను సందర్శించారు. మూడు రోజులపాటు జరిగే ఎక్స్‌పోలో అత్యాధునిక ఎలక్ట్రికల్ టెక్నాలజీలను, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పర్యావరణానికి అనుకూలమైన, తక్కువ కరెంటును వాడుకునే ప్రొడక్టులను ఈ సందర్భంగా లాంచ్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పారిశ్రామిక వినియోగదారుల కోసం 200లకుపైగా స్టాల్స్‌లో ప్రొడక్టులను ప్రదర్శిస్తారు.