
ఎలక్ట్రిక్ వెహికల్స్ పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 19శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం మొత్తం 8వేల 968 యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాది ఇదే నెలలో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ 7వేల 539 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
డీలర్ల సంస్థ FADA రిపోర్టుల ప్రకారం..ఫిబ్రవరి టాటామోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి.మొత్తం 3వేల 825 యూనిట్లు విక్రయించారు. రెండో స్థానంలో MG కార్లకంపెనీ ఉంది. ఇది 3వేల 270 కార్లను సేల్ చేసింది.
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ గడిచిన సంవత్సరంలో 18.95 శాతం పెరుగుదలను చూశాయి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ పై వినియోగదారులకు పెరుగుతున్న ఇంట్రస్ట్, అవగాహన ప్రతిబింబిస్తుంది. కార్ల మార్కెట్ వాటాలో ఇప్పుడు ఎలక్ర్టిక్ వెహికల్స్ వాటా 3శాతంగా ఉంది అని FADA వెల్లడించింది.
ALSO READ | Gold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే..?
ఇక ఎలక్ట్రిక్ బైక్ ల విషయానికొస్తే.. ఈ విభాగంలో ఫిబ్రవరిలో 76వేల 086 బైకులు అమ్ముడయ్యాయి. అదే గత ఫిబ్రవరిలో 82వేల745 అమ్ముడయ్యాయి. అంటే 8 శాతం తగ్గింది. బజాజ్ ఆటో ఫిబ్రవరిలో 21వేల 389 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉంది.
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు 8.05 శాతం తగ్గినప్పటికీ మార్కెట్ లో 5.6 శాతం గణనీయమైన వాటాను కొనసాగించింది. ఇది సరసమైన EV మొబిలిటీ సొల్యూషన్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని స్పష్టం చేస్తుంది. అయితే ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ 53వేల116 రిటైల్ అమ్మకాలు జరిగాయి. సంవత్సరంలో 5శాతం పెరిగాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాణిజ్య వెహికల్స్ అమ్మకాలు ఫిబ్రవరిలో 856 యూనిట్లు అమ్ముడుపోయాయి. సంవత్సరంలో 1 శాతం పెరిగాయి.