Good Health : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నం మంచిదా కాదా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

Good Health : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నం మంచిదా కాదా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇప్పుడు అందరి ఇళ్లల్లో కనిపిస్తుంది. కూరలు ఏ పాత్రల్లో వండినా.. అన్నం మాత్రం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోనే వండుతారు చాలా మంది. అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండే అన్నం ఆరోగ్యానికి
అంత మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. రైస్ కుక్కర్ తయారీకి వాడే అల్యూమినియం చాలా ప్రమాదం అంట. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం.. అలా తయారు చేసిన ఆహారాన్ని నిల్వ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

అలాగే వంట వండేటప్పుడు ఆహారానికి గాలి, వెలుతురు ఉండాలి. అవి లేకపోతే.. ఆహారం అనారోగ్యకరంగా మారుతుంది. సరైన పాత్రలు, సరైన వెంటిలేషన్ లేకపోతే వండిన ఆహారం పాయిజన్ గా మారే ప్రమాదముందంట. దీని వల్ల పొట్టలో నొప్పి, గుండె సమస్యలు, కీళ్లవాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. 

అందుకే ఎలాంటి ఆహారం తింటున్నామనే కాకుండా వంట ఎలా చేస్తున్నామనేది కూడా చూసుకోవాలి. రైస్ కుక్కర్లకు బదులు మామూలు పాత్రల్లో వండుకుని తింటే మంచిది. అలాగే వంట గదికి బాగా వెంటిలేషన్ ఉండేటట్లు కూడా చూసుకోవాలి.
== వెలుగు, లైఫ్