టూల్స్ గాడ్జెట్స్ : ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్

టూల్స్ గాడ్జెట్స్ :  ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్

ఫ్లోర్​కు మొండి మరకలు అంటినప్పుడు వాటిని తొలగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలాసేపు స్క్రబ్​ చేస్తే తప్ప అవి వదలవు. కానీ.. లీహెల్టన్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్​ స్క్రబ్బర్​తో క్షణాల్లో మరకలు తొలగించొచ్చు. దీన్ని ఫ్లోర్‌‌‌‌‌‌‌‌తోపాటు బాత్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌,  కిచెన్‌‌‌‌‌‌‌‌, గోడలు, షెల్ఫ్​లను శుభ్రం చేయడానికి కూడా వాడొచ్చు. దీనివల్ల చాలా టైం మిగులుతుంది. 

మనం 30 నిమిషాల్లో చేసే పనిని ఇది 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. స్క్రబ్బర్​ తిరిగే స్సీడ్​ని 250, 350 ఆర్పీఎంల్లో అడ్జెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి ఫుల్​ చార్జ్ చేస్తే 90 నిమిషాల పాటు వాడుకోవచ్చు. 0 నుంచి 100 శాతం ​ చార్జ్​ కావడానికి 4 గంటలు పడుతుంది. ​ ఫుల్ చార్జ్​ అయిన వెంటనే ఆటోమెటిక్​గా పవర్​ కట్​ అవుతుంది. 

బ్యాటరీలో చార్జింగ్​ ఎంత ఉందనేది ఎల్​ఈడీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ మీద చూపిస్తుంది. పోర్టబుల్​ సైజులో ఉండడం వల్ల పిల్లలు,  పెద్దలు, వృద్ధులు ఎవరైనా దీన్ని ఈజీగా ఆపరేట్​ చేయొచ్చు. దీనికి స్క్రబ్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఏడు రకాల హెడ్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. క్లీన్​ చేసే సర్ఫేజ్​ని బట్టి వాటిని మార్చుకోవాలి. ఫ్లోర్​కి మాప్​ పెట్టడానికి కూడా ప్రత్యేకంగా ఒక స్క్రబ్బర్​ వస్తుంది. 

ధర రూ 1549