విజ్జీ రైడర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్లు..

విజ్జీ రైడర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్లు..

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: క్విక్ కామర్స్ కంపెనీలకు డెలివరీ పార్టనర్లను అందించే‌‌  విజ్జీ తమ రైడర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్లను అందించింది. రాష్ట్ర  ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జ‌‌యేష్ రంజ‌‌న్  ఈవీ బైక్ తాళాల‌‌ను రైడర్లకు ఇచ్చారు. ఈ సంద‌‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈవీ వాహ‌‌నాల విప్లవంలో తెలంగాణ ముందు ఉంద‌‌ని, ప్రభుత్వం ఈవీ వాహ‌‌నాల‌‌కు అనేక రాయితీల‌‌ను ఇస్తోంద‌‌ని చెప్పారు. 

ప‌‌ర్యావ‌‌ర‌‌ణ ప‌‌రిరక్షణ‌‌లో   భాగ‌‌మైనందుకు 'విజ్జీ'ని జ‌‌యేష్ అభినందించారు. 'విజ్జీ' హైద‌‌రాబాద్ కేంద్రంగా ప‌‌ని చేస్తోంది. జెప్టో, బిగ్ బాస్కెట్‌‌, బ్లింక్ ఇట్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి కంపెనీలకు  డెలివ‌‌రీ పార్టనర్లను అందిస్తోంది.