ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీకి రూ.10 వేల కోట్లు

ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీకి రూ.10 వేల కోట్లు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ఇంకా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. 60 వేల కార్లకు రూ.2.5 లక్షల చొప్పున, 20 వేల హైబ్రిడ్‌ కార్లకు రూ.20 వేల చొప్పున, పబ్లిక్‌ ట్రాన్స్‌‌పోర్ట్‌ బస్సులకు రూ.40 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.10 వేల కోట్ల ప్యాకే జీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో కొనే వాహనాలకే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఎలక్ట్రిక్‌ బైకులు, ఆటోలు, ప్రభుత్వ బస్సుల కొనుగోలుకు ప్యాకేజీ నుంచి ఎక్కువ నిధులు కేటాయిస్తారు.

ఈ–రిక్షా డ్రైవర్లు కూడా సబ్సిడీకి అర్హులేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు మహీంద్రా ఈ–వెరిటో ఎలక్ట్రిక్‌ కారు కొంటే రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. నాణ్యమైన ఎలక్ట్రిక్‌ బైక్‌ కంటే రూ.40 వేల వరకు రాయితీ దక్కించుకోవచ్చు. పబ్లిక్‌ ట్రాన్స్‌‌పోర్ట్‌ బస్సుకు దాని ధరలో 40 శాతం లేదా రూ.60 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ ‘ఆపరేషనల్ ఎక్స్‌‌పెండిచర్‌‌’ విధానంలో నడిచే బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. ‘కాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌’ విధానంలో నడిచే బస్సులకు ఉండదు. ఫాస్టర్ అడాప్షన్ అండ్‌ మానుఫ్యాక్చరిం గ్‌ ఇండియా (ఫేమ్‌ ) రెండోదశ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రూ.10 వేల కోట్ల ప్యాకే జీకి రూపకల్పన చే సింది. ఈ విషయమై త్వరలోనే అధికారికంగా ప్రకటన చే స్తారని సంబంధిత అధికారి వివరించారు.