ఈ డెస్క్​ వాటర్​ డిస్పెన్సర్​ ... ఒక్కసారి చార్జ్​ చేస్తే.. 80 లీటర్ల నీళ్లను పంప్​ చేస్తది

ఈ  డెస్క్​ వాటర్​ డిస్పెన్సర్​ ... ఒక్కసారి చార్జ్​ చేస్తే.. 80 లీటర్ల నీళ్లను పంప్​ చేస్తది

 

అసలే ఎండాకాలం.. గంటకోసారైనా నీళ్లు తాగుతుంటాం. అందుకే ఫ్రిడ్జ్​లో బాటిల్స్​ వెంటవెంటనే ఖాళీ అవుతుంటాయి. కానీ.. ఖాళీ అయిన ప్రతిసారి వాటిని నింపాలంటే చాలా చిరాకేస్తుంది. అలాంటప్పుడు ఈ వాటర్ డిస్పెన్సింగ్ పంప్​ని వాడితో పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఉంటే క్యాన్​ని పైకి లేపి బాటిల్స్​లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఈ డిస్పెన్సర్​ని కిచెన్​లో సింక్ దగ్గర, షెల్ఫ్​, టేబుల్​.. ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి ఉండే పైపుని వాటర్​ క్యాన్​లో వేయాలి. దీనికి ఉండే క్విక్​ సిప్‌‌‌‌‌‌‌‌ బటన్​ నొక్కితే సరిగ్గా 300 ఎంఎల్​ నీళ్లు వస్తాయి. లీటర్​ బాటిల్​ నింపాలి అనుకుంటే ఫుల్ కప్ మోడ్ బటన్​ నొక్కాలి. ఇందులో ఇన్​బిల్ట్‌‌‌‌‌‌‌‌గా 1200mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్​ చేస్తే.. 80 లీటర్ల నీళ్లను పంప్​ చేస్తుంది. 4 గంటల్లో ​ ఫుల్ చార్జ్​ అవుతుంది. 

ధర : రూ. 999