ఆశ్రమ పాఠశాలలో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌

ఆశ్రమ పాఠశాలలో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: గోవిందరావుపేట మండలం కర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో ములుగు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన నీరటి ముఖేశ్‌‌‌‌‌‌‌‌ కర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఆడుకుంటుండగా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ గోడకు వేలాడుతున్న విద్యుత్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌ తగలడంతో షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టింది. గమనించిన హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌, సిబ్బంది ముఖేశ్‌‌‌‌‌‌‌‌ను 108లో ములుగు ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.