షార్ట్​ సర్క్యూట్​తో షాపు దగ్ధం..రూ.35 లక్షల ఆస్తి నష్టం

షార్ట్​ సర్క్యూట్​తో షాపు దగ్ధం..రూ.35 లక్షల ఆస్తి నష్టం

పెబ్బేరు, వెలుగు :    పట్టణంలో ప్రమాదవశాత్తు షాట్​సర్క్యూట్​ తో  ఎలక్ట్రికల్​ షాపు  కాలిపోయింది.   ఏఎంసీ చైర్​పర్సన్​ ప్రమోదిని కొడుకు యుగంధర్​ రెడ్డికి చెందిన ఎలక్ర్టికల్​ షాపులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత   షార్ట్​ ​సర్క్యూట్​ జరిగింది.  షాపు ఎదురుగా పుచ్చకాయలు అమ్మేవారు నిద్రిస్తున్న సమయంలో కాలుతున్న వాసన వచ్చి లేచి చూశారు. దీంతో ఓనర్లకు ఫోన్​  చేసి సమాచారమిచ్చారు.

వెంటనే ఓనర్లు ఫైరింజన్​కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కాని అప్పటికే షాపులో  సామగ్రి  కాలిపోయింది.  3 రోజుల క్రితమే షాపులో కొత్త స్టాకు పెట్టినట్లు తెలిపారు. సుమారు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు.   ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ చిన్నా రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.