- 11వ ఎలక్ట్రికల్ మహాసభల్లో సీఈఐజీ రామాంజనేయులు
హైదరాబాద్, వెలుగు:విద్యుత్ప్రమాదాలను అరికట్టడంలో లైసెన్స్కలిగిన ఎలక్ట్రికల్వర్కర్లదే కీలకపాత్ర అని చీఫ్ ఎలక్ట్రికల్ఇన్స్పెక్టర్ జనరల్ (సీఈఐజీ) సీహెచ్. రామాంజనేయులు తెలిపారు.
శనివారం హైదరాబాద్ఫ్యాప్సీ భవన్లో జరిగిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, వర్కర్ల 11వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఐజీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఎలక్ట్రికల్వర్క్ చేసే నిపుణులు నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు.
నిర్మాణదారులు, ప్రజలకు విద్యుత్పరికరాలపై అవగాహన కల్పించే బాధ్యత ఫీల్డ్ లేవల్ఎలక్ట్రికల్వర్కర్లదేనని పేర్కొన్నారు. ఇండ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల్లో బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లు వాడాలని, ఎలక్ట్రికల్రిపేర్లు క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్ తో మాత్రమే చేయించాలని వివరించారు.
మల్టీ స్టోరేజ్బిల్డింగ్స్ కు ఫైర్ ఆఫీసర్ల అనుమతితో పాటు హైడ్రెంట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి మూడు నెలల కోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలని వెల్లడించారు.