జీడిమెట్ల, వెలుగు : కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన పేట్బషీరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... చింతల్పరిధి బాపు నగర్‌కి చెందిన పి.రాజుగౌడ్ (37) ఎలక్ట్రీషియన్. ఆదివారం తను అద్దెకు ఉండే ఇంట్లో ఫైబర్కేబుల్నుంచి స్పార్క్ వస్తుండగా, చెక్ చేయాలని అతడిని ఓనరు సురేఖ కోరింది.
దీంతో రాజుగౌడ్మీటర్ మెయిన్ స్విచ్ఆఫ్ చేసి రిపేర్చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతడి శరీరం కాలిపోయి కిందపడి చనిపోయాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ : నల్గొండలో మహిళా కౌన్సిలర్ పై దాడి .. పరామర్శించేందుకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైదాడికి యత్నం