- ధర్నా చౌక్‌లో విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ధర్నాలో ఎమ్మెల్యే కూనంనేని
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. దీనికి భారీగా హాజరైన విద్యుత్ ఆర్టిజన్స్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెట్టానని, శాసనసభలో మాట్లాడి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ కార్మికులందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.