తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కరెంట్ బిల్లులు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు ఒక రూపాయి 40 పైసలు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూపాయి 57 పైసలు, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూపాయి16 పైసలు, 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నట్లు ఈఆర్సీ ప్రకటించింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు మరో నాలుగు నెలల తర్వాత అంటే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి.
తెలంగాణలో విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా.. 14 శాతం పెంచేందుకు కమిషన్ అంగీకరించింది. దాంతో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను యూనిట్‌కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ పెంచనున్నారు. ఏపీలో స్లాబుల వారీగా పెంచాలనుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం యూనిట్ల వారీగా పెంచనున్నారు.
For More News..