రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు

రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి.  డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే ఇందులో కొన్ని సవరణలు చేసినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలు 19శాతం  చార్జీలు పెంచాలని కోరగా.. 14శాతం పెంచడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‎గా చూస్తే  డొమెస్టిక్‎పై 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలపై యూనిట్‎కు రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీంతో సామాన్యుడిపై మరోసారి కరెంట్ చార్జీల భారం పడనుంది.