భారీగా పెరిగిన కరెంట్ వాడకం

భారీగా పెరిగిన కరెంట్ వాడకం

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో కరెంట్ వినియోగం 156.31    బిలియన్ యూనిట్ల (బీయూ) కు పెరిగింది. కిందటేడాది మే నెలలో  రికార్డయిన కరెంట్ వినియోగం 136.50 బీయూ కంటే ఇది 15 శాతం ఎక్కువ. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో  ఏసీలు, కూలర్లు వంటి కూలింగ్ అప్లియెన్స్‌‌‌‌ల వాడకం బాగా పెరిగింది. 

ఒక రోజులో రికార్డయిన కరెంట్ సప్లయ్‌‌‌‌ (పీక్ పవర్ డిమాండ్‌‌‌‌)  ఈ ఏడాది మే నెలలో 250.07 గిగావాట్లకు చేరుకుంది.  కిందటేడాది మేలో ఒక రోజులో చేసిన అత్యధిక కరెంట్ సప్లయ్‌‌‌‌ 221.42 గిగా వాట్లుగా ఉంది. ఈ  ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో పీక్‌‌‌‌ డిమాండ్ 260 గిగా వాట్లను టచ్ చేస్తుందని పవర్‌‌‌‌ మినిస్ట్రీ అంచనా వేసింది.