సర్వీస్ నంబర్లుసేకరణలో ఎన్పీడీసీఎల్
సదరన్ డిస్కంలో విద్యుత్ సంఘాల బిల్లులు కోట్లలో పెండింగ్
హైదరాబాద్, వెలుగు: సామాన్యులు ఒక్క నెల బిల్లు కట్టకపోతే కరెంటోళ్లు వచ్చి కనెక్షన్ కట్ చేస్తారు. అయితే సంస్థ తమదే కదా అని కరెంటోళ్లు తమ ఇండ్ల బిల్లులే కడతలేరట. దీంతో వరంగల్ కేంద్రంగా ఉండే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చర్యలకు సిద్ధమైంది. నార్తర్న్ డిస్కం పరిధిలో పదివేలకు పైగా ఉద్యోగులు, ఆర్టీజన్లు ఉన్నారు. ఉద్యోగులే బిల్లులు కట్టడం లేదని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన సంస్థ.. బిల్లులు కట్టని ఉద్యోగుల సర్వీసు నంబరు వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఉద్యోగులందరి వేతనాల చేంజ్ రిటర్న్ పంపించేటప్పుడు మీటర్ సర్వీసు నంబర్ల వివరాలు సేకరించాలని ఆపరేషన్ విభాగం ఎస్ఈలను ఆదేశించింది. నెల నెల ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించే అకౌంట్స్ విభాగం ప్రతి సర్కిల్ పరిధిలోని ఉద్యోగులకు హాజరు వివరాలతోపాటు ఇండ్ల మీటర్ సర్వీసు నంబర్లు జాబితాతో వారు బిల్లు కడుతున్నారా లేదా అనేది నమోదు చేసి పంపించాలని చెప్పింది. అవసరమైతే వాళ్ల శాలరీల నుంచి బిల్లుల బకాయిలు కట్ చేసుకోవాలని ఆ సంస్థ యోచిస్తోంది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో కోట్ల బకాయిలు..
హైదరాబాద్ కేంద్రంగా ఉన్నఎస్ పీడీసీఎల్ పరిధిలో ఉద్యోగుల సంఘాలది ఇదే పరిస్థితి. మింట్కాంపౌండ్లో 50కి పైగా ఉద్యోగ సంఘాల ఆఫీసులున్నాయి. వీటికి సంబంధించి కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 20, 30 ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టట్లేదు. ఒక్కో సంఘానివి లక్షల్లో బకాయిలు ఉన్నాయి. కొన్ని సంఘాల బిల్లులు రూ.40లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
For More News..