సీఎం సహాయ నిధికి రూ.18.69 కోట్ల విరాళం

సీఎం సహాయ నిధికి రూ.18.69 కోట్ల విరాళం
  • డిప్యూటీ సీఎం భట్టికి చెక్కును అందించిన విద్యుత్​ ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులు సీఎం సహాయనిధికి రూ.18.69 కోట్లను విరాళంగా అందించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు 70,585 మంది తమకు సంబంధించిన ఒకరోజు మూలవేతనాన్ని చెక్కు రూపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంగళవారం సెక్రటేరియెట్ లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్  ఫారూకీ , ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాస్ రావుతో పాటు విద్యుత్​ సంఘాల నేతలు రత్నాకర్​రావు, శివాజీ, అంజయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్​ ఉద్యోగుల దాతృత్వాన్ని ప్రశంసించారు.
.