కామేపల్లి, వెలుగు : విద్యుత్ అధికారులు కొత్త లింగాల సెక్షన్ లోని బర్లగూడెం గ్రామంలో సోమవారం పొలం బాట నిర్వహించారు. మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఓల్టేజీ హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్ లోడ్ల గురించి అవగాహన కల్పించారు.
కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలున్నా రైతులు అధికారుల దృష్టికి తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ ఇంజనీరు రామారావు, కొత్త లింగాల ఏడీఈ ఆనంద్, కొత్త లింగాల ఏఈ శ్రీనివాసులు విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.