
మే 1 నుండి 7 వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ట్రాన్స్‌కో ఎస్ఈ ఉత్తం జాడే తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యుత్ భద్రత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఈ ఉత్తం జాడే సూచించారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన విద్యుత్ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలని, సొంత పనులతో ప్రమాదాల బారినపడొద్దని విజ్ఞప్తి చేశారు.