హైదరాబాద్: గత రాత్రి కురిసిన వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో 24 గంటలుగా చందానగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చందానగర్ సబ్ స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
మంగళవారం( మే 7)సాయంత్రం కురిసిన వర్షానికి చందానగర్ లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయి ఏర్పడింది. అయితే విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇప్పటివరకు విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి నేల కూలిన చెట్లను తొలగించకుండా కాలయాపన చేస్తున్నారని చందానగర్ సబ్ స్టేషన్ వద్దకు స్థానికులు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.