
దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఈ మధ్య తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మంచిర్యా ల జిల్లాలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.
2024 మార్చి 13 బుధవారం మధ్యాహ్న సమయంలో ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ తీగ తెగినట్టు రైల్వే సిబ్బంది గుర్తించారు. మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు పట్టాలపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలెర్ట్ అయిన రైల్వే అధికారులు.. మరమత్తులు చేపట్టారు. ఈ కారణంగా మందమర్రి మీదుగా వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.