హైదరాబాద్లో భారీగా ఈ సిగరెట్ల దందా..వాట్సప్ గ్రూప్ ద్వారా బిజినెస్

హైదరాబాద్లో  భారీగా ఈ సిగరెట్ల దందా..వాట్సప్ గ్రూప్ ద్వారా బిజినెస్

డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నేరస్తులు కొత్త కొత్త మార్గాల ద్వారా సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సాదిక్ అలాని, అనిల్ అలాని అనే సోదరులు ఎస్ఐడీ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఐదు వందల మందిని సభ్యులుగా చేర్చారు. వీళ్లకు ఈ సిగరేట్లను విక్రయిస్తుండ టం కలకలం రేపింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా ప్రకటనలు పెట్టేవా రు. వినియోగదారులు వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు యూపీఐ, వాలెట్, బ్యాంక్ మార్గాల్లో డబ్బులు పంపించేవారు. ఈ ముఠాకు న్యూఢిల్లీలోని అమిత్, ముంబైకి చెందినవసీం అనే వ్యక్తులు సరఫరాదారులుగా పనిచేస్తు న్నారు. భారీ మొత్తాల కోసం హవాలా మార్గాలు కూడా ఉపయోగించేవారు. ర్యాపిడో, ఉబర్, DTDC ద్వారా డెలివరీ చేసేవారు. 13 మందివిద్యార్థులు ఈ ముఠాకు ఖాతాదారులని తేలింది. 400 మందికి పైగా వినియోగదారులు ట్రాన్సా క్షన్ల ద్వారా గుర్తించబడ్డారు. 7 కార్టస్ బాక్సుల్లో 1217 పీస్లు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.25 లక్షలు. అదనంగా రూ. 18,440,225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

కొరడా ఝులిపిస్తున్న టీజీ న్యాబ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ న్యాబ్ కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడంతోపాటు కావాల్సిన సిబ్బందిని సమకూర్చింది. దీంతో పాటు వాహనాలనూ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా మాదక ద్రవ్యాలు సిటీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి కేసులు నమోదు చేస్తున్నారు.

ఏమిటి ఈ సిగరేట్

సిగరేట్ లేదా పెన్నులా ఉండే ఎలక్ట్రానిక్ పరికరం ఇది.ఇందులో పొగాకుఉండదు. రకరకాలఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకం.వీటిలో వినియోగించే రసాయనాలు చాలా హానికరం అని. వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈసిగరేట్ వినియోగిస్తున్నప్పుడు. అందులోని నికోటిన్ ద్రావకం పొగలా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. వే వర్స్ క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధు లతో పాటు డీఎన్ఏ, మెదడు పనితీరు దెబ్బతింటుంది. కండరాల జబ్బులు వస్తాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది..