ఈవీఎంలు హ్యాక్ చేయడం చాలా ఈజీ.. నా దగ్గర ఆధారాలున్నాయి: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్

ఈవీఎంలు హ్యాక్ చేయడం చాలా ఈజీ.. నా దగ్గర  ఆధారాలున్నాయి: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్

ఈవీఎంల పనితీరుపై చాలా కాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈవీఎంలు రీకౌంటింగ్ చేయాలంటూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇదిలా ఉండగా అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఈవీఎంల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయడం చాలా ఈజీ అని.. మళ్ళీ బ్యాలట్ పేపర్ నినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆమె అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న తులసి గబ్బార్డ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రత లోపాల గురించి ఆధారాలతో సహా వివరించారు తులసి గబ్బర్డ్ .2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెమ్స్ చర్యలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతి రోజే అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

►ALSO READ | CM Mamata:వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయం:మమతా బెనర్జీ

ఇదిలా ఉండగా.. తులసి గబ్బర్డ్ వ్యాఖ్యలను ఖండించిన భారత ఎలక్షన్ కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది.. ఇండియాలో వాడుతున్న ఈవీఎంలు ఒక సాధారణ కాలిక్యులేటర్ తరహాలో పనిచేస్తాయని.. వీటిని ఇంటర్నెట్, ఇన్ఫ్రారెడ్‌కు అనుసంధానం చేయడం సులభం కాదని స్పష్టం చేసింది ఈసీ. కాబట్టి.. ఈవీఎంలు హ్యాకింగ్ కు గురికావడం అసాధ్యమని తేల్చి చెప్పింది ఈసీ.