ఒడిశాలోని రస్ గోవింద్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల గుంతలో పడిపోయింది. బయటకు రాలేక చాలా ఇబ్బంది పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును రక్షించారు. ఈ గుంత దాదాపు 5 ఫీట్ల లోతు ఉండటంతో అది బయటకు రాలేకపోయింది. గుంత చుట్టూ చిన్న ఏనుగుకు రక్షణగా ఏనుగుల మంద ఉండటంతో దాన్ని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో అధికారులు గుంత దగ్గరకు వెళ్లకుండానే దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గుంతలో నీళ్లు నింపారు. దీంతో చిన్న ఏనుగు అమాంతంగా పైకి తేలింది. దాన్ని చుట్టుూ ఉన్న ఏనుగులు బయటకు లాగాయి. గున్న ఏనుగు బయటకు రాగానే దాన్ని తీసుకుని మంద అడవిలోకి వెళ్లిపోయింది.
మరిన్ని వార్తల కోసం: