
జంతువులు మనుషుల మధ్య ప్రేమ, విధేయత అనేది మనం కథల్లో చదువుతుంటాం..చూస్తుంటాం..కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతుంటాయి..అలాంటిదే ఓ ఏనుగు, కేర్ టేకర్ మధ్య ఉన్న బంధాన్ని కళ్లకు కట్టిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడి యో ఇంటర్నెట్‌ని కంటతడి పెట్టించింది.
Elephant brought to hospital to say goodbye to his terminally ill caretaker. 🥲😞 pic.twitter.com/TKSNS6vy88
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) February 6, 2025
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కేర్ టేకర్ ను చూసేందుకు వచ్చింది ఓ ఏనుగు. చివరి క్షణాల్లో ఉన్న తన యజమానిని చివరి చూపు చూసుకు నేందుకు ఆ ఏనుగు తహతహలాడింది. భారీ కాయం ఉన్న ఆ ఏనుగు దర్వాజ తగలకుండా వంగుతూ అతికష్టం మీద బెడ్ వరకు చేరుకుని తన యజమానిని పరార్శించింది.ఏనుగు తన తొండంతో తన కేర్ టేకర్ చేతిని టచ్ చేస్తూ భావోద్వాగానికి గురవుతున్నట్లు ఈ వీడియాలో కనిపిస్తుంది.
హార్ట టచింగ్ వీడియోలో సోషల్ మీడియా స్పందన
ఈ హార్ట్ టచింగ్ వీడియో నెట్టింట షేర్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున్న వ్యూస్, లైకులను సంపాదించుకుంది. 60లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ భావాలను షేర్ చేసుకున్నారు.
ALSO READ | Viral Video: కుంభమేళాలో క్రికెట్ ఆడిన బాబాలు
‘‘ఇది ప్రేమకు స్వచ్ఛమైన రూపం.. జంతువులు తమను జాగ్రత్తగా చూసుకున్న వారిని ఎప్పటికీ మర్చిపోవు’’ అని ఓ నెటిజన్ కామెంట్ షేర్ చేశారు.
మరో నెటిజన్.. ఏనుగులు పరిమాణంలోనూ పెద్దవి.. అదే సమయంలో అది విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటాయని’’ రీపోస్ట్ చేశారు.
ప్రేమకు అవధుల్లేవు.. హృదయాన్ని స్పర్శించే వీడియో ఇది అని ఇంకో నెటిజన్ తన అభిప్రాయాన్ని షేర్ చేశారు.
ఇలాంటి హృదయాన్ని కదిలించే వీడియోలు మనం సోషల్ మీడియాలో అరుదుగా చూస్తుంటాం..జంతువులు, వాటిని సాకే యజమానుల మధ్య ఉండే బాండింగ్ కు సంబంధించిన వీడియో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మనుషులతో ఎక్కువగా జీవించే కుక్క, ఎద్దులు, ఆవులు, ఏనుగుల వంటి సాదు జంతువుల్లో ఇలాంటి భావాలు కనిపిస్తుంటాయి. తన యజమానిని ఎవరైనా టచ్ చేస్తే వారిని వెంటపడి తరిమే ఎద్దుకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.