ఏనుగుకు ఆకలేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. గోదాంను పగలగొట్టి తినేసింది

ఆకలి మనుషులకేనా.. జంతువులకు కూడా ఉంటుంది.. మనుషులకు ఆకలేస్తే దొంగతనం చేస్తారు.. అదే ఏనుగుకు ఆకలేస్తే.. ఆహారం దొరక్కపోతే ఏం చేస్తుంది అనే దానికే ఈ సమాధానం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళ రాష్ట్రం. కర్నాటక సరిహద్దుల్లోని గుండ్లుపేట్ అటవీ ప్రాంతం అది. దట్టమైన అడవి మధ్యలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాం ఉంది. అక్కడ బియ్యం నిల్వ ఉంచుతారు. అడవిలోని ఓ పెద్ద ఏనుగు ఆకలితో అలమటిస్తుంది.. ఆహారం కోసం నేరుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంలోకి వచ్చింది. పెద్ద ఏనుగు రాకతో అక్కడ పని చేసే కార్మికులు అందరూ షాక్ అయ్యారు.. ఏనుగు అరుపులకు పరుగులు తీశారు.

గోదాం ఏరియాలోకి వచ్చిన ఏనుగు.. నేరుగా గోదాం దగ్గరకు వెళ్లింది. షెట్టర్లు వేసి ఉండటంతో.. తన బలంతో షెట్టర్ ను పగలగొట్టింది. లోపలికి వెళ్లింది. ఓ బియ్యం బస్తాను బయటకు తీసుకొచ్చింది. తన కాలితో బియ్యం బస్తాను ఉంచి.. తొండంతో బస్తాను పగలగొట్టింది. బియ్యం తినేసింది. తన ఆకలి తీర్చుకున్నది. 

అడువులు నాశనం అవుతున్నాయి.. అడవుల్లో జంతువులకు ఆహారం దొరకటం లేదు అనటానికి ఇదే నిదర్శనం. ఈ వీడియోను నరేష్ నంబిసన్ అనే వ్యక్తి తన ఎక్స్ లో పోస్ట్ చేయటంతో.. వైరల్ అయ్యింది. ఆకలేస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లాలని ఏనుగుకు కూడా తెలిసిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఏనుగులకు కూడా రేషన్ ఇవ్వాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ గోదాంలో ఆహారం ఉంటుందని ఏనుగుకు ఎలా తెలుసు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అడవులను నాశనం అయ్యాయి అనటానికి.. అడవుల్లో జంతువులకు ఆహారం దొరకటం లేదు అనటానికి ఇదే ఎగ్జాంపుల్ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఏదిఏమైనా.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంపై దాడి చేసి బియ్యం బస్తాను తినేసిన ఏనుగును అరెస్ట్ చేస్తారా లేదా అంటూ మరికొందరు అధికారులను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేయటం విశేషం.