![రైతును పొలంలోనే తొక్కి చంపేసిన ఏనుగులు](https://static.v6velugu.com/uploads/2024/10/elephants-attack-on-faramer-at-peeleru_BXQHjkv1sP.jpg)
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలం లో దారుణం జరిగింది. ఏనుగుల దాడిలో రైతు చిన్న రాజారెడ్డి మృతి చెందాడు. తన మామిడి తోపు దగ్గర కాపలాగా ఉన్న రైతు చిన్న రాజారెడ్డిపై ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసి తొక్కి చంపాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. 10 ఏనుగుల గుంపు పంట స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వలన పచ్చని పొలాలు నాశనమవుతున్నాయి. గజరాజుల నుంచి తమ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.