ఏనుగుకు హెయిర్ స్టైల్.. వైరల్ అవుతున్న వీడియో

ఏనుగుకు హెయిర్ స్టైల్.. వైరల్ అవుతున్న వీడియో

సాధారణంగా ఏనుగు అంటే.. పొడవాటి తొండం.. పెద్ద పెద్ద చెవులు,వెను తోక కనిపిస్తాయి. చాలా మంది జంతు ప్రేమికులు ఏనుగుల్ని కూడా పెంచుకుంటుంటారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల్ని కూడా మిగతా జంతువుల్లాగే ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. అయితే అలా ఓ వ్యక్తి తాను పెంచుకున్న ఏనుగుకు హెయిర్ స్టైల్ కూడా చేయించారు. అయితే అలాంటి ఇలాంటి హెయిర్ స్టైల్ కాదు. ఏకంగా బాబ్ కట్ చేయించాడు. అంతేకాకుండా ఏనుగు నుదుటిపై తిలకాన్ని కూడా దిద్దాడు.  ఈ వీడియో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ తెక్కంపత్తి గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ గజరాజుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

అయితే అతడు ఏనుగు హెయిర్ స్టైల్ దువ్వేటప్పుడు ఆ ఏనుగు తన కాళ్లపై వంగడం కూడా చేస్తోంది. దీంతో ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కో నెటిజన్ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్స్ ‘ హ్యాండ్ సమ్ బోయ్’  ‘ సో క్యూట్’ అంటూ ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ‘మేడ్ మై డే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్స్ ఓమ్ శ్రీ గణేషా అంటూ.. భక్తితో కూడా నినాదాలు కూడా చేస్తున్నారు.