-
ఇది సంతోషకర విషయం
-
ట్విట్టర్ లో ప్రధాని మోదీ
ఢిల్లీ: భారతీయ సంస్కృతి, చరిత్రలో ఏనుగులకు విశిష్ట స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్నేళ్లుగా భారత్‌లో ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషించదగిన విషయమన్నారు. ఏనుగులను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏనుగులను రక్షించడం, వాటి సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత కొన్నేళ్లుగా భారత్ లో వాటి సంఖ్య పెరుగుతుండటం సంతోషించదగిన పరిణామమని అన్నారు.