బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలి: మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు:  యువత జీవితాలతో చెలగాటమాడుతున్న  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని బీజెపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం, సోన్ మండలం, సారంగాపూర్ మండలం, మామడ మండలం, నిర్మల్ టౌన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందన్ఆనరు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తోందన్నారు.  కార్యక్రమంలో  రావుల రామనాథ్,  భూమయ్య,   నాయకులు పాల్గొన్నారు.