
న్యూఢిల్లీ: డయాబెటిస్ చికిత్సలో, బరువు తగ్గడానికి వాడే మందు మౌంజరోని ఎలీ లిల్లీ ఇండియాలో లాంచ్ చేసింది. రెగ్యులేటర్స్ నుంచి అనుమతులు వచ్చాయని కంపెనీ ప్రకటించింది. 5 ఎంజీ వయల్‌ను రూ.4,375 కి అందుబాటులోకి తెచ్చింది. 2.5 ఎంజీ వయల్ ధర రూ.3,500. గ్లోబల్‌గా మౌంజరోకి ఫుల్ డిమాండ్ ఉందని ఈ యూఎస్ కంపెనీ పేర్కొంది.
ఇండియాలో సుమారు 10 కోట్ల మంది ఊబకాయం, టైప్2 డయాబెటిస్‌తో భాదపడుతున్నారు. మౌంజరో కెమికల్ పేరు టిర్జెపటైడ్. గ్లోబల్‌గా ఊబకాయం మందుల సేల్స్ విలువ 2030 నాటికి ఏడాదికి 150 బిలియన్ డాలర్లు (రూ.13 లక్షల కోట్లు) దాటుతుందని అంచనా.