మార్చిలో ఖాళీ కానున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి సీటు

  • భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తానని మునుగోడు ఎన్నికల టైంలో సీఎం హామీ
  • గౌడ సామాజికవర్గంలో లోటును పూడ్చే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రేసులో మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్​

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో త్వరలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ పదవి బీసీలకే దక్కుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ పదవి బీసీలకు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మేలు కలుగుతుందని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన హామీకి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టుబడి ఉంటాడని ఆ పార్టీ ముఖ్యనేతలు నమ్మకంతో ఉన్నారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నికల్లో నోముల భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ కోటాలో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ అయిన తేరా చిన్నపరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వకుండా అదే సామాజిక వర్గానికి చెందిన కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. ప్రస్తుతం మార్చిలో ఖాళీకానున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి పోస్టుపై ఆసక్తి నెలకొంది. మునుగోడు బైపోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తిరిగొచ్చిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. అయితే ఇదే పదవిపైన మరో ఇద్దరు బీసీ నేతలు సైతం నమ్మకం పెట్టుకున్నారు. మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పదవి కోసం విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గట్టిగానే ప్రయత్నిస్తునట్టు తెలిసింది. కానీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో బలమైన గౌడ సామాజిక వర్గం మెప్పు పొందాలంటే భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్ప మరో ఆలోచన చేయకపోవచ్చని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. 

గౌడ సామాజిక వర్గం ఓట్ల కోసం...

ఉమ్మడి జిల్లా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గౌడ సామాజిక వర్గానికి సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిపోయాక ఆ వర్గం నుంచి ఎవరికీ పదవులు దక్కలేదు. నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ మారడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. భువనగిరి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గౌడ ఓటర్లు బలంగా ఉన్నారు. పైగా నర్సయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీలైనంత త్వరగా భర్తీ చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లు పార్టీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. భువనగిరి ఎంపీ సీటు రెండు సార్లు బీసీలకే ఇచ్చినా, వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఆ వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోతుంది. అదీగాక ఆలేరులో గ్రూపు తగాదాలు సమసిపోవాలంటే భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్పా మరో మార్గం లేదని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. ఈ ఆలోచనలో భాగంగానే ఇటీవల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయసింహారెడ్డికి ఆగ్రోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మ న్, చింతరెడ్డి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి రైతుబంధు జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చి నియోజకవర్గంలోని రెడ్డి ఓటర్లలో తేడా లేకుండా క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

సామాజిక వర్గాలకు ప్రయారిటీ

వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా బలమైన కులాలకు ప్రయారిటీ ఇచ్చామని చెప్పుకునేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల వారీగా రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు కట్టబెడుతోంది. ఉమ్మడి జిల్లాలో యాదవుల కోటాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్నూరుకాపు కోటాలో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదా కల్పించారు. విద్యాసాగర్​ తర్వాత ఆ కోటాలో జిల్లాలో ఎవరికీ పదవి దక్కలేదు. ప్రస్తుతం గౌడ కోటాలో ఎమ్మెల్సీ పదవి భర్తీ చేశాక, పద్మశాలి వర్గానికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవి ఇస్తారని చెబుతున్నారు. మునుగోడు ఎన్నికల్లో భాగంగా పద్మశాలీలకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కోటాలో రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రైకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవి అప్పగించారు. ఇదే క్రమంలో త్వరలో మరిన్ని కులాలకు పదవులు ఇస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.