ముంపు గ్రామాలలో 8 వేల ఓట్లు తొలగింపు

రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఈసీ తాజాగా ప్రకటించింది. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిద్దిపేట జిల్లాలో 18 వేల 71 మందిని జాబితా నుంచి తొలగించారు. దీంట్లో అత్యధికంగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులే ఉన్నారు. మొత్తం 8,483 మంది ఓటర్లను తొలగించారు. మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణంతో దుబ్బాక నియోజకవర్గ పరిధి తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి ముంపుకు గురయ్యాయి. అలాగే కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో వారికి గజ్వేల్ పట్టణ పరిధి ముట్రాజ్ పల్లిలో పునరావాసం కల్పించారు. అయితే వారికి ఓటు హక్కు పునరుద్దరణకు అవకాశం కల్పించినప్పటికీ పర్మినెంట్ అడ్రస్ లేకపోవడంతో ఓటు కోల్పోయామని అంటున్నారు. ముంపుకు గురై అన్ని కోల్పోయామని... ఇప్పుడు ఓటు హక్కు కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For More News..

జకోవిచ్ వీసా రద్దు.. ఇప్పటికీ ఎయిర్‎పోర్టులోనే

మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతారా?

ఉమెన్స్ వరల్డ్ కప్‎కు సైన్యం సిద్దం