ఎలైట్ఎలివేటర్స్​నుంచి రెండు కొత్త ప్రొడక్టులు

ఎలైట్ఎలివేటర్స్​నుంచి రెండు కొత్త ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: ప్రీమియం హోమ్​లిఫ్టులను తయారు చేసే ఎలైట్​ఎలివేటర్స్​ ఎక్స్​300, ఎక్స్​300 ప్లస్​ హోమ్​ లిఫ్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఎర్రర్​ నోటిఫికేషన్​సిస్టమ్​, రిమోట్​డయాగ్నిస్టిక్స్​, భారీ వేగం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఈ ఏడాది చివరికి అమెరికా, కెనడా వంటి కొత్త విదేశీ మార్కెట్లలోనూ అడుగుపెడతామని వెల్లడించింది. కంపెనీ సీఈఓ విమల్​బాబు మాట్లాడుతూ ఇండియా హోం ఎలివేటర్​ మార్కెట్​ 2030 నాటికి 8–9 శాతం సీఏజీఆర్​ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి తమ ప్రొడక్షన్​ కెపాసిటీని ఏటా మూడు వేల యూనిట్లకు పెంచుతామని ప్రకటించారు.