- ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సైనికుడిలా, సేవకుడిలా ఉండి పనిచేస్తానని కాంగ్రెస్అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. మండలంలోని రుద్రారం, అల్మాజీపూర్, జంగమయ్యపల్లి, మత్త మల, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం మదన్ మోహన్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ కార్డులను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ తన ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఇచ్చే వేతనం, అలవెన్స్ లో నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకుంటానని చెప్పారు.
ప్రతి మండల కేంద్రానికి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరాలంటే ఈ నెల 30న చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మకుండా ఎవరి బెదిరింపులకు భయపడకుండా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆరిఫ్, బాలరాజ్ గౌడ్, లక్ష్మణ్, సర్పంచులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు ఎల్లారెడ్డి ఎంపీపీ రిజైన్
ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం కాంగ్రెస్అభ్యర్థి మదన్ మోహన్ రావు సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. కార్యక్రమంలో బాల్ రాజ్ గౌడ్, నాగిరెడ్డిపేట ఎంపీపీ రాజ్ దాస్, ఆరిఫ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : ఎన్ని సీట్లు వచ్చినా అధికారం చేపడుతాం : ఎంపీ ధర్మపురి అర్వింద్