నెలరోజుల్లో కేసీఆర్​ దుకాణం బంద్ : మదన్​మోహన్​రావు

  •     ఎమ్మెల్యే సురేందర్​కు డిపాజిట్ ​గల్లంతు 
  •     కాంగ్రెస్ అభ్యర్థి మదన్​ మోహన్ ​రావు

లింగంపేట, వెలుగు: నెలరోజుల్లో సీఎం కేసీఆర్​దుకాణం బంద్​ అవుతుందని, ప్రజలకు మేలు చేసే కాంగ్రెస్​ ప్రభుత్వం రాబోతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్​అభ్యర్థి మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం లింగంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనకు ఏ పదవి లేకపోయినా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు.

కరోనా టైమ్​లో ప్రజలకు అండగా ఉన్నానని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేశానన్నారు.ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. గత నియోజకవర్గంలో కాంగ్రెస్​నుంచి గెలిచిన సురేందర్​ బీఆర్​ఎస్​కు అమ్ముడుపోయారని, ఈ ఎన్నికల్లో ఆయన డిపాజిట్​గల్లంతవుతుందన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అందుబాటులో ఉండనంటూ బీఆర్​ఎస్​ నేతలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టాలన్నారు. 

కాంగ్రెస్​లో చేరిన లింగంపేట జడ్పీటీసీ

కాంగ్రెస్​అభ్యర్థి మదన్ ​మోహన్ ​రావు  సమక్షంలో లింగంపేట జడ్పీటీసీ ఏలేటి శ్రీలత, సంతోష్​రెడ్డి, కోమట్​పల్లి ఎంపీటీసీ కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ భాగవ్వ, మోతె సర్పంచ్​ఏలేటి రాంరెడ్డి, సురాయిపల్లి సర్పంచ్​ రాజశేఖర్​రెడ్డి, మాలోత్​తండా సర్పంచ్​ సునీత, ఎక్కపల్లి సర్పంచ్​సతీష్​గౌడ్, ముంబాజీపేట సర్పంచ్​ స్వప్నలతో పాటు వివిధ గ్రామాల ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు కాంగ్రెస్​లో చేరారు.