- టికెట్‌పై పట్టువీడని మదన్మోహన్, సుభాష్‌రెడ్డి
- ఇద్దరిలో ఒకరిని పక్క నియోజకవర్గానికి వెళ్లాలని సూచిస్తున్న పార్టీ పెద్దలు
- నేడు వెలువడే కాంగ్రెస్మొదటి లిస్ట్‌లో పేరుండడం అనుమానమే?
కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్‌పార్టీలో ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ఆశిస్తున్న ఆ పార్టీ నేతలు కె.మదన్మోహన్రావు, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పట్టు వీడడం లేదు. టికెట్తమకే కేటాయించాలంటూ తమ గాడ్ ఫాదర్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కోసం ముఖ్య నేతలు స్ర్కీనింగ్ కమిటీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు ఢిల్లీ అధిష్టానానికి ఈ ఇద్దరి నేతల పేర్లు సిఫార్సు చేశారు. ఇక్కడ పలు దఫాలుగా నిర్వహించిన సమావేశాల్లోనూ ఎల్లారెడ్డిపై చాలా సేపు చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇరువురు నేతలు తమ బలాబలాలు, విజయావకాశాలను వివరిస్తూ టికెట్తమకే కేటాయించాలంటూ పట్టుబట్టారు. వీరిద్దరిలో ఎల్లారెడ్డి టికెట్ ఎవరికి దక్కనుందనే దానిపై నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టికెట్‌పై ఎవరికి వారు గట్టి ధీమాతో ఉన్నారు. మరో వైపు తమ నేతకే టికెట్వస్తుందంటే తమ నేతకే అంటూ సోషల్‌మీడియా వేదికగా వారి అనుచరులు పోస్టులు పెడుతున్నారు.
ఒకరు పక్క నియోజకవర్గం వెళ్లండి..
టికెట్ కోసం పోటీ పడుతున్న ఇరువురిని పార్టీ ముఖ్యనేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, సర్వే రిపోర్టులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ కేటాయిస్తామంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. ఓ నేతను పక్క నియోజకవర్గానికి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో క్యాడర్‌ను డెవలప్ చేసుకొని, ఇప్పుడు పక్క నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయమంటే ఎలా అని అందుకు సదరు నేత నో చెప్పినట్లు తెలుస్తోంది.
జుక్కల్, బాన్సువాడలో..
జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల సెలక్షన్‌పై ఇంకా క్లారిటీ కాలేదు. జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారాం, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ గడుగు గంగాధర్ టికెట్ఆశిస్తున్నారు. బాన్సువాడ టికెట్ కోసం కూడా చాలా మంది అధిష్టానానికి అర్జీలు పెట్టుకున్నారు. రెండు చోట్ల కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. బాన్సువాడలో కుల సమీకరణను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది.
మొదటి లిస్ట్‌లో నో క్లారిటీ!
నేడు కాంగ్రెస్ మొదటి లిస్ట్‌లో విడుదల కానుంది. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కానున్నారు. మొదటి లిస్ట్‌లో కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పేరు వచ్చే ఛాన్స్ఉంది. టికెట్ కోసం టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలను నెక్ట్స్లిస్ట్ లో ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.