
జమ్మికుంట, వెలుగు: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.20,69,829 వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. మంగళవారం ఎండోమెంట్ కరీంనగర్ డివిజన్ పరిశీలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో హుండీలు లెక్కించారు. నగదుతోపాటు 12 గ్రాముల మిశ్రమ బంగారం, 35 గ్రాముల మిశ్రమ వెండి, 6వేల విలువ చేసే విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. గతంలో కంటే కూడా ఈసారి 2,94,257 అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులతో పాటు మడిపల్లి వాలంటీర్లు, రాజరాజేశ్వర సమితి సభ్యులు పాల్గొన్నారు.