బీఆర్ఎస్ లో చేరి.. మాకేం చేసినవ్?..ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ని నిలదీసిన కాంగ్రెస్​శ్రేణులు

  • బీఆర్ఎస్ లో చేరి.. మాకేం చేసినవ్?
  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ని నిలదీసిన కాంగ్రెస్​శ్రేణులు

కామారెడ్డి : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వెళ్తున్నఆయనను కాంగ్రెస్ నాయకులు, కార్యక్తరలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి. బీఆర్ఎస్ లో చేరి.. ఏమీ అభివృద్ధి చేశావంటూ నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును నిరసిస్తూ రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి.