అవిశ్వాసంపై కోర్టుకెక్కిన కౌన్సిలర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అసమ్మతి పోరు రోజుకో మలుపు తిరుగుతుంది. మున్సిపల్ ఛైర్మన్పై తిరుగుబాటు ప్రకటించిన కౌన్సిలర్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఛైర్ పర్సన్పై అవిశ్వాసం పెట్టే అవకాశమున్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. 4 రోజులుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించగా ఎట్టకేలకు శుక్రవారం అర్థరాత్రి కోర్టు దాన్ని స్వీకరించింది. ఈ నెల 21న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది.